ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ సూపర్ న్యూస్

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డుకు (Transgender Welfare Board) కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (GO) జారీ చేసింది.

ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ సూపర్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డుకు (Transgender Welfare Board) కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (GO) జారీ చేసింది. ఈ బోర్డు సభ్యుల నియామక ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టింది. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్ల నుంచి అందిన సిఫార్సుల ఆధారంగా అర్హులైన వారిని సభ్యులుగా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఈ బోర్డు వారధిలా పనిచేయనుంది. బోర్డు కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను, విశాఖపట్నం, తిరుపతి జిల్లాల కలెక్టర్లను ప్రాంతీయ ప్రతినిధులుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.

ప్రభుత్వ లక్ష్యం..

సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేయడమే ఈ బోర్డు ప్రధాన లక్ష్యం. ఈ నియామకాల ద్వారా తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ట్రాన్స్‌జెండర్ వర్గాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story