- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో పుష్కరాలు.. ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు ఇవే..!
జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి....

దిశ, వెబ్ డెస్క్: జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రం(Kaleshwaram Kshetra)లో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గోదావరి(Godavari), ప్రాణహిత నదుల(Pranahita Rivers)తో అంతర్ వాహినిగా సరస్వతీ నది(Saraswati River) కలిసే త్రివేణి సంగమంలో మాధవానందస్వామి తొలి స్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పుష్కరాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
దీంతో ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ, అమలాపురం నుంచి సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏసీ సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకూ ఈ బస్సులను నడపనునున్నారు. పుష్కరాలకు వెళ్లే భక్తులు ఆన్ లైన్ ద్వారా తమ సీట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. విజయవాడ నుంచి కాళేశ్వరం మీదుగా ధర్మపురి, వేములవాడ, కొండగట్టు ఆలయాల సందర్శనకు సైతం ఏర్పాట్లు చేశారు.






