- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9న పవన్ రాక... పట్టణమంతా వెలుగులు
కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి. ...

దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సంబరాలు అంబరాన్నంటేలా చేయాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 9,10,11 తేదిల్లో సంబరాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈనెల 9,10,11 తేదిల్లో అత్యంతవైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఇందుకోసం కళాకారుల నిర్వాహణకు, ఛార్జీలకు రూ.4.80 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర యువజనసర్వీసులు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ బాధ్యతలను కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పిఠాపురం పాతబస్టాండు వద్ద రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. గోపూజ, భోగిపండ్లు వేసే వేడుక, ఫ్యాన్సీ డ్రస్, పిండి వంటలు, రంగ వల్లుల పోటీలు నిర్వహిస్తారు. పట్టు, వ్వవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ, పశుసంవర్థక, ఐసీడీఎస్ శాఖలు కార్యక్రమాల నిర్వాహణలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. మొత్తం 27 కళారూపాలు, ఇతర ప్రాంతాల నుండి 300 మంది కళాకారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. సంక్రాంతి సంబరాల నిర్వాహణకు పోలీసు శాఖ నుండి 250 మంది బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో అన్ని సక్రమంగా జరగాలని, ఫ్లెక్సిల ప్రొటో కాల్ వివాదాలు లేకుండా చేయాలని ఇప్పటికే డీఆర్వో వెంకట్రావు స్పష్టం చేశారు.
పట్టణమంతా వెలుగులు.. 9న పవన్ రాక
మూడు రోజుల పాటు ప్రతీ దుకాణానికి ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడానికి చాంబర్ ఆఫ్ కామర్స్ సంఘం నాయకులు సహకరిస్తున్నట్లు అధికారులకు తెలిపారు. పిఠాపురం దూళ్ల సంత నుండి, ఉప్పాడ బస్టాండు, పాదగయ జంక్షన్ వరకూ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఈనెల 9న పవన్ పిఠాపురం రానున్నారు. ఉదయం మంగళగిరి నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి అక్కడ నుండి హెలికాఫ్టర్‌లో పిఠాపురం ఆర్ ఆర్ బిహెచ్ ఆర్ క్రీడా ప్రాంగణంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు పవన్ చేరుకుంటారు. ఓబిఎస్‌లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అదే రోజు పలు అభివృద్ధి పనులకు శంకస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఆయన కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఈమేరకు ప్రభుత్వం పవన్ టూర్ షెడ్యూల్ విడుదల చేసింది.






