- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. సీఎం ఏం చేయనున్నారంటే
నారావారి పల్లెలో కుటుంబ సమేతంగా సీఎం పర్యటన.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామమైన నారావారిపల్లెలో (Naravaripalle) పర్యటిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భాగంగా సీఎం తన స్వగ్రామంతోపాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లె గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి దాదాపు రూ. 160 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నారావారిపల్లెలో రూ. 1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, 33/11 కేవీ సబ్ స్టేషన్, శేషాచల లింగేశ్వర స్వామి దేవాలయానికి నిర్మించిన బీటీ రోడ్డును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. అలాగే తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలో నిర్మించిన బాలుర, బాలికల హాస్టల్ భవనాలను, రుయా ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేసిన వసతి సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
మరోవైపు ప్రాంతీయ సాగునీటి అవసరాల కోసం నీవా కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్, ఇతర చెరువులకు నీటిని తరలించే రూ. 126 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు ఎస్వీ యూనివర్సిటీలో అత్యాధునిక పరిశోధనశాలల నిర్మాణానికి కూడా పునాది రాయి వేస్తారు. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి, జనవరి 15న గ్రామ దేవత నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తిరిగి అమరావతికి పయనమవుతారని అధికార వర్గాలవారు తెలిపారు.






