- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ కీలక పరిణామం.. ఏపీ నూతన ఇన్‌ఛార్జి డీజీపీగా శంఖబ్రత బాగ్చి
రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో నెలకొంటున్న శాంతి భద్రతల సమస్యలు, వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌ను బదిలీ చేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆయన స్థానంలో.. ఆంధ్రప్రదేశ్ నూతన ఇన్‌ఛార్జి డీజీపీగా ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి నియమించింది. కాగా ఆయన ఈ రోజు ఇన్‌ఛార్జ్ డీజీపీగా భాద్యతలు స్వీకరించారు. ఏపీ నూతన డీజీపీ నియామకం పై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ఇదిలా ఉండగా ద్వారాకా తిరుమలరావు కొత్త డీజీపీగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read More..
Next Story






