- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పన్నుల వసూలు కోసం సీన్ రివర్స్.. దెబ్బకు పరుగో.. పరుగో
పన్నుల వసూలు కోసం వెళ్లి సంచివాలయం సిబ్బందిపై దాడి జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా కమలాపురం(Kamalapuram)లో దారుణం జరిగింది. పన్నులు(Taxes) వసూలు కోసం వెళ్లిన సచివాలయం సిబ్బంది(Secretariat Staff)పై సుబ్బారాయుడు అనే వ్యక్తి దాడి చేశారు. ఏంది కట్టేదంటూ తొలుత ఘర్షణకు దిగారు. పన్ను పేపర్లు లాక్కుని రోడ్డుపై విసిరేశారు. ఆ తర్వాత వెంటపడి మరి దాడి చేశారు. అడ్డుకోబోయిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(Revenue Inspector)పైనా దాడికి యత్నించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయాన్ని రెవెన్యూ అధికారులు తెలియజేసేందుకు వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. కమలాపురం పోలీస్ స్టేషన్(Kamalapuram Police Station)లో ఫిర్యాదు చేశారు. అధికారులను సుబ్బారాయుడు వెంబడించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు సుబ్బారాయుడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.






