‘దావోస్ వెళ్లి పులిహోర చెప్పినట్లు ఉంది’.. సింగపూర్ పర్యటన పై సజ్జల సంచలన కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-01 07:51:23  IST  )

ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘దావోస్ వెళ్లి పులిహోర చెప్పినట్లు ఉంది’.. సింగపూర్ పర్యటన పై సజ్జల సంచలన కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత బయటపడుతుందని నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల పై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. నోటీసులు ఇచ్చి జనాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన పై సజ్జల విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు కారణంగా సింగపూర్ ప్రభుత్వంలో పెద్దలు అవినీతిలో కూరుకపోయారని వ్యాఖ్యానించారు. దావోస్ వెళ్లి పులిహోర చెప్పినట్టు సింగపూర్ టూర్ ఉందని ఎద్దేవా చేశారు. ఇతర దేశాలకు వెళ్లి ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో అధికారులు కూడా ప్రభుత్వానికి వంతపాడుతున్నారని వైసీపీ నేత సజ్జల విమర్శలు గుప్పించారు.

పాలసీ వల్ల నష్టం ఎక్కడ జరిగిందో చెప్పడం లేదని ప్రశ్నించారు. 2014-19 మధ్య జరిగింది స్కామ్ అని ఆధారాలు చూపించాం. 2014-19 మధ్య రూ.1300 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లో ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కూటమి లిక్కర్ పాలసీ వల్ల ఆదాయం కూడా పెరగలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ నియంత్రించాం, ఆదాయం పెరిగింది అని తెలిపారు. కూటమి ప్రభుత్వం బలవంతంగా మద్యం తాగిస్తోందని ఆరోపించారు.

రూ.11 కోట్లు బయటపడటం వెనక అనుమానం ఉంది. అరెస్టులు జరుగుతుంటే ఇంకా డబ్బులు దాచిపెట్టి ఉంచుతారా? అని నిలదీశారు. పీఎల్ఆర్ కంపెనీకి కాంట్రాక్టు లో భాగంగా డబ్బులు వచ్చాయి. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.. లిక్కర్‌ కేసులో రోజుకో పిట్టకథ చెబుతున్నారు.. తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒకరు ECM, ఇద్దరు DCMలు ఉన్నారు.. ఇన్నాళ్లు డబ్బు ఎందుకు దొరకలేదని సజ్జల ప్రశ్నించారు. శత్రువులు వచ్చినట్లు ముళ్ల కంచెలు వేసి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైరయ్యారు.

Next Story