టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంపై సజ్జల స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా చంద్రబాబు ఎన్నో స్కామ్‌లు చేశారని అన్నారు. ఎన్ని అక్రమాలు చేసిన తనను ఎవరూ అరెస్ట్ చేస్తారన్న చంద్రబాబు ధీమా ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను నియమించుకున్నారని.. విమానాల్లో లాయర్లను రప్పించారని.. దీంతో చంద్రబాబుకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యిందని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయన సొంతపుత్రిడి కంటే దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ హడావుడి ఎక్కువ అయ్యిందని ఎద్దేవా చేశారు. నిన్న రాత్రి పవన్ కల్యాణ్ చాలా ఎక్కువ చేశారని ఫైర్ అయ్యారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed