- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మావిగన్’పై వెనక్కి తగ్గని జగన్.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిగ్ ప్లాన్
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీది స్పష్టమైన వైఖరి అని, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati) విషయంలో వైసీపీ(Ycp)ది స్పష్టమైన వైఖరి అని, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(YCP State Coordinator Sajjala Ramakrishna Reddy) అన్నారు. జగన్ ప్లాన్ బి(Jagan Plan B) అమలు చేసే అంశంపై వైఎస్సార్సీపీ(Ysrcp) కీలక నేతలతో ఆయన టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrababu) ప్లాన్ అని చెప్పారు. గతంలో విశాఖ(Visakha)ను గ్రోత్ కారిడార్‌గా అనుకున్నామని, అమరావతి(Amaravati)ని గుదిబండలా మార్చే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ చెప్పినట్లు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు రియల్ క్యాపిటల్‌గా గ్రోత్ కారిడార్‌గా మెగా సిటీగా మారుతుందని తెలిపారు. అంతేకాదు ఆర్గానిక్ గ్రోత్ ఉంటుందని, ఇది మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చన్నారు. రాయ్‌పూర్, నోయిడాలు ఎన్ని ఏళ్ళయినా ప్రజా రాజధానిగా లేవన్నారు. చంద్రబాబు అమరావతి కోసం చేస్తున్న అప్పు ఎప్పటికి తీరుతుందో తెలీదని చెప్పారు. కానీ జగన్ ప్రతిపాదిస్తున్న ప్లాన్ బి అమరావతిలో పదో వంతు ఖర్చు పెడితే చక్కటి రాజధాని సిద్దమవుతోందని తెలిపారు. మిగిలిన కొంత డబ్బుతో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో ప్రాజెక్టులు పూర్తిచేయవచ్చన్నారు. ఇదంతా జగన్ ఆలోచిస్తుంటే దానిని పక్కదోవ పట్టించడానికి టీడీపీ నాయకులు డ్రామాలు నడిపారని సజ్జల చెప్పారు.
మట్టి కుప్ప వద్ద దండాలు పెట్టి...
పార్లమెంట్‌లో, ఉద్దండరాయునిపాలెంలో మట్టి కుప్ప వద్ద దండాలు పెట్టి ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని సజ్జల విమర్శించారు. జగన్ చెప్పిన ప్రతి మాట గ్రామగ్రామానికి వెళ్ళాలని సూచించారు. జగన్ ఏది సాధ్యం, ఏది అసాధ్యం అనేది వివరించారని, ఆచరణాత్మకంగా చేయగలిగేది ఆయన స్పష్టంగా చెప్పారన్నారు. చంద్రబాబు మాత్రం వేల ఎకరాల భూసమీకరణ, భూసేకరణలపై ప్రజల్లో చర్చ జరగాలని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు దింపుతున్న ఊబిలో దిగకుండా ప్లాన్ బి పేరుతో జగన్ చెప్పిన ప్రణాళికపై విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాలని సూచించారు. ఈ రోజు కూడా అమరావతి నిరంతర ప్రక్రియ అని చంద్రబాబు అంటున్నారని, అంటే దానిని కామధేనువులా దోచుకోవాలన్నదే ప్లాన్ అని, ఈ విషయంలో అన్ని ప్రాంతాల ప్రజల మధ్య చర్చ జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.






