- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్ అరాచకం: పోలీసులపై సజ్జల ఫైర్
వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్ అరాచకమని పోలీసులపై ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై అసత్య వార్తల ప్రచారంపై శ్రీహరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్‌పై స్పందించిన సజ్జల ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా శ్రీహరి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్ అరాచకమని పోలీసులపై ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై అసత్య వార్తల ప్రచారంపై శ్రీహరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్‌పై స్పందించిన సజ్జల ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా శ్రీహరి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్ అరెస్ట్ చేసి ఆ తర్వాత సోదాలు అంటున్నారని ధ్వజమెత్తారు. శ్రీహరిని భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసులు పూర్తిగా పాలకులకు వంతపాడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు నిబంధనలు పాటించడంలేదని, కనీసం ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. శ్రీహరి గతంలో జర్నలిస్టుగా పని చేశారని, ఆయన ఉగ్రవాది కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న శ్రీహరిని అలా అరెస్ట్ చేస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.






