- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతికి చట్టబద్ధత .. అంతా భ్రమ : సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతికి చట్టబద్ధత అనేదంతా భ్రమ అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణ విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత తీసుకురావడమనేది అంతా భ్రమ అని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాజధానిగా చెప్తున్న ప్రాంతం.. మరో 30-40 ఏళ్లయినా అభివృద్ధి జరగదని జోస్యం చెప్పారు. ఇందుకు ఛత్తీస్ గఢ్ లోని నవ రాయ్ పూర్ ఉదాహరణ అని పేర్కొన్నారు. తాజాగా జగన్ ప్రస్తావించిన మావిగన్ పై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని, రాష్ట్ర ప్రజలంతా దీనిపై చర్చించుకుంటున్నారన్నారు. జగన్ పిలుపుతో మావిగన్ కు ఒక రూపు వచ్చిందన్నారు. మావిగన్ ను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే.. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నాడు తాము ప్రతిపాదించిన మూడు రాజధానులను పక్కన పెట్టారని, ఇప్పుడు మావిగన్ ను కూడా అలాగే చూస్తున్నారని విమర్శించారు. అమరావతిలో ఉండేందుకు ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లేవని, అలాంటి ప్రాంతంలో రూ.2 లక్షల కోట్లను ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ఉండాలన్నా ఖర్చెక్కువే అవుతుందన్నారు. కానీ.. మావిగన్ అందులో 10 శాతం ఖర్చుతో అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. అతి త్వరలో పోర్టు కూడా వస్తుందన్నారు. అమరావతికి ఆదాయం ఎలా వస్తుందని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు.






