ఎవరినీ వదలం.. కేసులు వేస్తాం: టీడీపీ నేతలకు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-01 10:17:50  IST  )

ఎవరినీ వదలమని కేసులు వేస్తామని టీడీపీ నేతలపై సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..

ఎవరినీ వదలం.. కేసులు వేస్తాం: టీడీపీ నేతలకు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu)పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అంబటిని అదుపులోకి తీసుకుని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అంబటి రాంబాబును ఈ పీఎస్ నుంచి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

అంబటిపై హత్యాయత్నం జరిగింది...

దీంతో అంబటికి వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు. అంబటి రాంబాబు ఫ్యామిలీని వైసీపీ నేతలు సజ్జల, విడుదల రజినీతో పాటు పలువురు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అంబటి ఇంటిపై ఐదు గంటల పాటు దాడి జరిగిందని ఆరోపించారు. జరిగిన ఘటనను అందరూ చూశారన్నారు. అంబటి అరెస్ట్ తర్వాత సైతం దాడి జరిగిందని తెలిపారు. అధికారం ఇస్తే కూటమి నాయకులు ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యర్థులనే కాదు ప్రజలను కూడా వేధిస్తున్నారని మండిపడ్డారు. శనివారం అంబటి ఇంటి దగ్గర జరిగిన ఘటనకు మూలకారణం ఏంటి అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబునే ఆరోపించారని, కానీ అది అబ్ధమని దేశంలోని ప్రముఖ ల్యాబ్‌లు తేల్చాయన్నారు. దీనిపై చంద్రబాబు ఇప్పటివరకూ మాట్లాడలేదని చెప్పారు. లడ్డూ కల్తీ నిజం అంటూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో బ్యానర్లు పెట్టారన్నారు. పోలీసుల సమక్షంలోనే అంబటిపై దాడి జరిగిందని ఆరోపణలు చేశారు. దాడికి ముందు తమ ఫోన్లకు పోలీసులు రిప్లై ఇవ్వలేదన్నారు. అంబటిపై హత్యాయత్నం జరిగిందని చెప్పారు. ఎవర్నీ వదలమని, అందరిపైనా కేసులు వేస్తామని సజ్జల హెచ్చరించారు.

Next Story