అసలైన లిక్కర్ స్కామ్ వాళ్ల హయాంలోనే జరిగింది : సజ్జల హాట్ కామెంట్స్

by Naga Rani Yarlagadda |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna) స్పందించారు.

అసలైన లిక్కర్ స్కామ్ వాళ్ల హయాంలోనే జరిగింది : సజ్జల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna) స్పందించారు. ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహిస్తే స్కామ్ జరుగుతుందా ? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కట్టు కథలతో లిక్కర్ కేసు సృష్టించారని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేని తప్పుడు కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అసలైన లిక్కర్ స్కామ్ చంద్రబాబు హయాంలో జరిగిందని, సాక్ష్యాధారాలతో సహా లిక్కర్ స్కామ్ పై కేసు పెట్టామన్నారు. గతేడాది ఆగస్టు నుంచి మొదలైన లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం సేకరించలేకపోయిందని, దీనిని బట్టే లిక్కర్ స్కామ్ జరగలేదని తెలుస్తోందన్నారు.

కేవలం రాజకీయ కక్షలతోనే లిక్కర్‌స్కామ్‌ను చూపించి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఆధారాలు దొరకడం లేదని సిట్ అధికారులు చెప్తూనే.. ఇప్పటి వరకూ 12 మంది అరెస్ట్ చేశారని, ఇంకెంతమందిని ఇలాగే అరెస్ట్ చేస్తారో తెలియదన్నారు. విజయసాయిరెడ్డి విచారణ గురించి ప్రశ్నించగా.. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని, ఆయన వివరణ ఏంటో ఆయన్నే అడగాలని సూచించారు.

Next Story