- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఏపీ ఫ్యూచర్ సేఫ్’.. మామ పవన్ అఖండ విజయంపై సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ ట్వీట్
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం ఖాయమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏకపక్షంగా దూసుకుపోతున్న ఎన్డీఏ

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం ఖాయమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏకపక్షంగా దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి.. అధికార వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించింది. కూటమిలోని కీలక నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ వంటి కీలక నేతలు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సారి మాత్రం పిరాపురం నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నాడు. లాస్ట్ టైమ్ రెండు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన నిరాశ చెందకుండా వెనక్కి తగ్గకుండా పట్టువోని విక్రమార్కుడిలా పోరాడిన పవన్.. పిఠాపురంలో భారీ విజయం దక్కించుకుని ఫస్ట్ టైమ్ అసెంబ్లీలో కాలి పెట్టేందుకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు పలువురు సీని, రాజకీయ సెలబ్రేటీలు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ఇప్పటికే సోదరుడు పవన్ కల్యాణ్, ప్రధాని మోడీ పవన్‌కు విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే తన మామ ఘన విజయంపై మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ వర్తమానం, భవిష్యత్ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ పవన్ కల్యాణ్ ఓ చిన్నపిల్లాడిని ఆప్యాయంగా ఎత్తుకుని ఉన్న ఫొటోను ట్యాగ్ చేశాడు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో జనసేన ‘బలమైన తుపాను’ సృష్టించిందని ప్రశంసంలు కురిపించాడు.






