- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగించింది నిజమే.. అధికార పార్టీ MP ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant)పై విశాఖ ఎంపీ శ్రీభరత్(MP Sribharat) కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant)పై విశాఖ ఎంపీ శ్రీభరత్(MP Sribharat) కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగించిన మాట వాస్తవమే అని అన్నారు. అవసరమైన మేరకు కార్మికులను ఉంచుకుని మిగతావారిని తొలగిస్తున్నారని తెలిపారు. మళ్లీ బ్లాస్ట్, ఫర్నెస్ త్రీ ప్రారంభిస్తారని ఈ సందర్భంగా ఎంపీ భరత్ తెలిపారు. అప్పుడు అవసరమైతే కొంతమందిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు.. కార్మికులు, యాజమాన్యం కలిసి పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మొత్తం 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. కార్మికులు తమ తొలగింపులను వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగారు. ప్లాంట్ యొక్క భవిష్యత్తు గురించి ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.






