- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు’.. అధికార పార్టీ MP ఆసక్తికర వ్యాఖ్యలు
నరసరావుపేట(Narasaraopeta) ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Krishna Devarayalu) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నరసరావుపేట(Narasaraopeta) ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Krishna Devarayalu) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీ చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు.. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. అలాంటి క్యారెక్టర్ నాది కాదు’ అని ఆయన స్పష్టత ఇచ్చారు. 40 ఏళ్లుగా విజ్ఞాన్ సంస్థలు(Vignan institutions) నడుపుతున్నట్లు చెప్పారు. ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు.. అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదని వెల్లడించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఉన్నప్పుడు వేలంవేస్తే.. ఆ వేలంలో పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నామని అన్నారు. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. చాలా మంది దగ్గర విడదల రజిని డబ్బులు తీసుకున్నారు.. 10 రోజుల క్రితం కేసును ఆపాలని.. ఓ వ్యక్తిని నా దగ్గరికి రాయబారానికి పంపారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. ‘నాపై కేసు ఎవరు పెట్టించరో.. ఎందుకు పెట్టించారో నాకు అన్నీ తెలుసు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే నాపై ఏసీబీ కేసు పెట్టారు. అసలు ఆయనకు నామీద కోపం ఎందుకు ఉందో కూడా తెలియదు. 2020 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. సెప్టెంబరు 2వ తేదీన వైఎస్ వర్దంతి రోజు ఇద్దరు పోలీసులకు లంచాలు ఇచ్చి.. నా ఫోన్, నా బంధువుల ఫోన్ నెంబర్లు కనుక్కొని కాల్ డేటా తీశారు. అసలు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి.. ఎమ్మెల్యే కాల్ డేటా తీస్తారా?. నా వ్యక్తిగత జీవితంలోకి ఆయన ఎందుకు రావాలనుకున్నారో చెప్పాలి’ అని విడుదల రజినీ(Vidadala Rajini) నిన్న మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.






