- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలు అడిగిన సమాచారం ఇవ్వకపోతే కఠిన చర్యలు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్ హెచ్చరిక
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ (ఆర్టీఐ) ప్రధాన కార్యాలయంలో నూతన చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ (ఆర్టీఐ) ప్రధాన కార్యాలయంలో నూతన చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు ఇతర కమిషనర్లు కూడా పదవులు చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ కమిషనర్ సునీల్ కుమార్ నూతన కమిషనర్లకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్య ప్రజలకు పారదర్శకంగా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు ఆర్టీఐ చట్టం కింద అడిగిన సమాచారాన్ని అధికారులు ఇవ్వకపోతే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు న్యాయం చేయడం తమ బాధ్యతగా భావించి పని చేస్తామని ఆయన తెలిపారు. అధికారులు చట్టాన్ని గౌరవిస్తూ, నిర్ణీత గడువులో సమాచారాన్ని అందించాల్సిందేనని స్పష్టం చేశారు.






