ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఆందోళన.. చిలకలూరిపేటలో ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిలకలూరిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడటం అమానుషమని, రక్షణ లేని చోట విధులు నిర్వహించడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు..

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఆందోళన.. చిలకలూరిపేటలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ డ్రైవర్లు(RTC Drivers), కండక్టర్ల(Conductors)పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిలకలూరిపేట(Chilakaluripet)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ తోటి సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు, డ్రైవర్లు స్థానిక బస్టాండ్ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడటం అమానుషమని, రక్షణ లేని చోట విధులు నిర్వహించడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారుల నినాదాలతో బస్టాండ్ ప్రాంగణం హోరెత్తింది.

బస్సులను అడ్డుకున్న డ్రైవర్లు

ఈ ఆందోళన ప్రభావంతో ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు కదలకుండా డ్రైవర్లు అడ్డుకున్నారు. బస్సులను వరుసగా నిలిపివేసి డిపో గేట్ల వద్దే బైఠాయించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, తమపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గేదే లేదని సిబ్బంది స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story