ఏపీలో షాకింగ్ ఘటన.. డ్రైవర్ కళ్లు మూసి తెరిచేలోపు ఆర్టీసీ బస్సు మాయం

by Ajay Maddhiboyina |

బైక్ దొంగలు, కార్ దొంగలను చూసే ఉంటాం. కానీ బస్సు దొంగలించాలంటూ అంత ఈజీ కాదు. అలాంటి ఘటనలు అరుదుగా కనిపిస్తాయి. కానీ ఏపీలో ఓ దొంగ ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఆర్డీసీ బస్సునే మాయం చేశాడు.

ఏపీలో షాకింగ్ ఘటన.. డ్రైవర్ కళ్లు మూసి తెరిచేలోపు ఆర్టీసీ బస్సు మాయం
X

దిశ‌, వెబ్ డెస్క్: బైక్ దొంగలు, కార్ దొంగలను చూసే ఉంటాం. కానీ బస్సు దొంగలించాలంటూ అంత ఈజీ కాదు. అలాంటి ఘటనలు అరుదుగా కనిపిస్తాయి. కానీ ఏపీలో ఓ దొంగ ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఆర్డీసీ బస్సునే మాయం చేశాడు.డ్రైవర్ కళ్లు మూసుకుని ఓ కునుకు వేసేసరికి దొంగ ఏకంగా బస్సునే ఎత్తుకుపోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరు బస్ స్టాడ్‌లో బస్సును పార్క్ చేసిన డ్రైవర్ రెస్ట్ రూమ్‌లో నిద్రపోయాడు. తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి బస్సు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు నెల్లూరు పాలెం సర్కిల్ వద్ద బస్సును గుర్తించారు. బస్సు నడుపుతున్న దొంగను అరెస్ట్ చేశారు.

Next Story