- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
by Ramesh Naini |
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తుండగా దోర్నాల మండలం చిన్నారుట్ల, తుమ్మలబైలు సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు వద్ద డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు.. అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులతో పాటు అందరూ స్థానికులు కూడా ఊరట చెందారు.
Next Story






