- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రాణ నష్టం
పొగ మంచు కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. పోలీసుల వివరాల ప్రకారం బాపులపాడు మండలం కానుమోలు (Kanumolu) సమీపంలో జాతీయ రహదారిపై (National Highway) ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు (Lorry and Bus Accident) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సును రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రమాదానికి ప్రధాన కారణం తెల్లవారుజామున కురిసిన దట్టమైన పొగమంచు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పొగమంచు కారణంగా రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. శీతాకాలం కావడంతో వాహనదారులు పొగమంచు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.






