- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రాణనష్టం
ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరగడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లాలోని (East Godavari District) గొల్లగూడెం వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆర్టీసీ బస్సు ఓ లారీని (RTC Bus hits Lorry) వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రికి (Rajahmundry) ఆర్టీసీ బస్సు బయలుదేరింది. అయితే గొల్లగూడెం సమీపానికి చేరుకున్న క్రమంలో ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ముందున్న లారీని దాటే క్రమంలో బస్సు అదే లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుకు పాక్షికంగా దెబ్బతినింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. సుమారు 80 మంది బస్సులో ప్రయాణిస్తుండగా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న దేవరపల్లి పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.






