రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ వాహనాల్లో విస్తృత తనిఖీలు.. 289 కేసులు నమోదు

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లా కావేరి బస్సు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులపై కొరడా జులిపించారు....

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ వాహనాల్లో విస్తృత  తనిఖీలు.. 289 కేసులు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా కావేరి బస్సు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులపై కొరడా జులిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్‌ వాహనాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్‌ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేశారు. ట్రావెల్స్‌ బస్సులపై ఇప్పటి వరకు రూ.7.08 లక్షల జరిమానా విధించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు లేని ట్రావెల్స్ కు సైతం భారీగా ఫైన్స్ వేశారు. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు చేయనగా 3 బస్సులు సీజ్ చేశారు. తూర్పేగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు చేయగా 4 బస్సులు సీజ్ చేశారు. కోనసీమ- 27, చిత్తూరు- 22, కర్నూలు- 12, విశాఖ-7, నంద్యాల-4 కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేని 8 బస్సులతో పాటు ఎమర్జెన్సీ కిటీకీలు లేని 13 బస్సులపైనా కేసులు నమోదు చేశారు. ఫైర్ పరికరాలు లేని 103 బస్సులపైనా కేసులు నమోదు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై ఇక నుంచి ప్రతి నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

Next Story