శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

by Thanuru Gopichand |   (  Updated:2025-12-26 04:47:33  IST  )

తిరుమల (Tirumala) శ్రీవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Mohan Bhagwath) దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) శ్రీవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Mohan Bhagwath) దర్శించుకున్నారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి శుక్రవారం ఉదయం ఆయన తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు చేరకున్న మోహన్ భగవత్ తో పాటు కేంద్రమంత్రికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ఏకే సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఎదురెళ్లి వారిని స్వాగతించారు. స్వయంగా తీసుకెళ్లి వారికి దర్శనం చేయించారు. నేరుగా స్వామివారి మండపం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేకంగా మూలమూర్తి దర్శనం జరిపించారు. అనంతరం అక్కడ నుంచి రంగనాయక మండపానికి వెళ్లారు. రంగనాయక మండపంలో ఆసీనులైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రం కప్పారు. వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటం, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీని బహుకరించారు.

వైజ్ఞానిక సమ్మేళనానికి..

నేడు జాతీయ సంస్కృత వర్సిటీలో వైజ్ఞానిక సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమ్మేళనాన్ని ప్రారంభించనున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ హాజరవుతారు. ఆధునిక సమాజంలో వేదాలు, శాస్త్రాలు, సంస్కృతం ప్రాముఖ్యత తెలియజేసేలా కార్యక్రమం జరగనుంది. భారతీయ విజ్ఞానం, వైభవం, ఖగోళ శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అధ్యయనాలపై వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.

Related News : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Next Story