- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
by Jakkula.Mamatha |
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(గురువారం) శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,154 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.12 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Next Story






