తిరుమలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

by Ramesh Naini |

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుమలలో పర్యటిస్తున్నారు.

తిరుమలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుమలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మోహన్ భగవత్‌తో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా అన్నప్రసాదం స్వీకరించారు.

తిరుమలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటన సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి సేవల నిర్వహణ తీరును భగవత్ ఆసక్తిగా పరిశీలించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, రేపు ఉదయం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుమల పర్యటన నేపథ్యంలో భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

Next Story