- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
18 నెలల్లో పెన్షన్ల కోసం రూ.50 వేల కోట్ల ఖర్చు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాాఖ్యలు
18 నెలల తమ ప్రభుత్వ పాలనలో కేవలం పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: 18 నెలల తమ ప్రభుత్వ పాలనలో కేవలం పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఆయన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని గోపీనాథపట్నంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ఉంగుటూరులో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించి, ప్రజా వేదిక సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసి చూపించామన్నారు. 18 నెలల్లోనే పెన్షన్ల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఏపీ కంటే ధనిక రాష్ట్రాలు కూడా పెన్షన్ల కోసం ఇంతగా ఖర్చు చేయడం లేదన్నారు. రాబోయే ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని అన్నారు.
గ్రామ సభలు ఒక మార్పు తీసుకొచ్చేలా నిర్వహించాలన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా రైతులు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితేనే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టే అక్కడి భూముల ధరలు ఆటోమెటిక్‌గా పెరిగాయన్నారు. ఒకప్పుడు కోకాపేటలో రూ.10 వేలకు ఎకరం భూమి వచ్చేదని, ఇప్పుడు ఎకరం రూ.170 కోట్లకు పైనే పలుకుతోందని అన్నారు. ఏపీలో భవిష్యత్తులో అలాంటి రోజులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.






