మందుబాబులకు BIG షాక్.. ఫుల్‌ బాటిల్‌పై రూ.50 పెంపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-31 08:20:29  IST  )

నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాల పనివేళల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది.

మందుబాబులకు BIG షాక్.. ఫుల్‌ బాటిల్‌పై రూ.50 పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూఇయర్ వేళ మందుబాబులకు మద్యం వ్యాపారులు భారీ షాకిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా(Konaseema District)లో మద్యం రేట్లు పెంచారు. ఫుల్ బాటిల్‌పై అదనంగా రూ.50 పెంచారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వ్యాపారులు రేట్లు పెంచడంపై మందుబాబులు మండిపడుతున్నారు. ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాల పనివేళల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. డిసెంబర్ 31, జనవరి 1న రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను నడుపుకునేందుకు అనుమతి జారీ చేసింది. ఈ రెండు రోజులు వైన్ షాపులతో పాటు బార్లు, ఇన్ హోస్ లైసెన్సులు, పర్మిట్ రూమ్ లైసెన్సనులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి :

ఇక ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే హోటళ్లకు కూడా అనుమతి ఇచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఆ రెండు రోజుల పాటు మాత్రమే అర్థరాత్రి 12 గంటల వరకు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. మిగతా రోజుల్లో యథావిధిగా కార్యకలాపాలు ఉండనున్నాయి. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించిన ప్రభుత్వం.. శాంతి భద్రతలను ఎలాంటి ఆటకం కలగకుండా నిర్వహించుకోవాలని ఆదేశించింది. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది.

Next Story