పారిశుధ్య కార్మికులకు రూ. కోటి బీమా

by Muthe.Rajitha |

ఏపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది.

పారిశుధ్య కార్మికులకు రూ. కోటి బీమా
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపింది. మున్సిపల్ కార్మికుల భద్రత కోసం కొత్త ఆరోగ్య బీమాను ప్రారంభించారు. ఈ కొత్త ఆరోగ్య బీమాను స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతులం మీదుగా శనివారం లాంఛ్ చేసారు. పారిశుధ్య కార్మికులు అనేక ప్రమాదాల బారిన, అనారోగ్యాల బారిన పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. వారికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.కోటి విలువైన బీమాను తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు.

పట్టణాభివృద్ధి శాఖ - యాక్సిస్ బ్యాంకు సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నాయి. మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న శాశ్వత పారిశుధ్య కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా, రూ.10 లక్షల లైఫ్ కవర్, ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్న వారికి రూ.20 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లైఫ్ కవర్ ఉండనుంది. అలాగే కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా తక్కువ ప్రీమియంతో రూ. 33 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తించనుంది.

Next Story