ఎగిరిపోయిన రూ.80వేల చిలుక.. కోనసీమలో యజమాని ఆవేదన

by Naga Rani Yarlagadda |

అతనొక పక్షి ప్రేమికుడు. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న రూ.80 వేల చిలుక పండుగ రోజే పంజరం నుంచి ఎగిరిపోవడంతో దాని ఆచూకీ కోసం చుట్టుపక్కలంతా వెతికాడు.

ఎగిరిపోయిన రూ.80వేల చిలుక.. కోనసీమలో యజమాని ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: అతనొక పక్షి ప్రేమికుడు. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న రూ.80 వేల చిలుక పండుగ రోజే పంజరం నుంచి ఎగిరిపోవడంతో దాని ఆచూకీ కోసం చుట్టుపక్కలంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నాడు. మూడేళ్లుగా పెంచుకుంటున్న తన "చార్లీ" కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపాలెంలో వెలుగుచూసింది ఈ వింత ఘటన.

గ్రామానికి చెందిన బండారు దొరబాబు అనే వ్యక్తి కాట్రేనికోనలో వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. పక్షులంటే ఎనలేని ఇష్టం. ఆ ఇష్టంతోనే మూడేళ్ల క్రితం హైదరాబాద్ లో రూ.80 వేలు పెట్టి మనుషుల్లా మాట్లాడే ఆఫ్రికన్ గ్రే ప్యారట్ జాతికి చెందిన చిలుకను కొన్నాడు. అప్పటి నుంచీ దానిని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. దాని అల్లరి చూసి మురిసిపోయేవాడు. ఈ ఏడాది సంక్రాంతి రోజున చార్లీ పంజరం నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. 10 రోజులైనా దాని ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలని డిసైడయ్యాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Next Story