- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bumper Offer: మూడో సంతానం అమ్మాయి అయితే రూ.50 వేలు అబ్బాయి అయితే ఆవు, దూడ కానుక .. ఎక్కడంటే..
ఆ నియోజకవర్గంలో మూడో సంతానంగా అమ్మాయి పెట్టిందా.. అయితే రూ.50000 గిఫ్ట్‌గా వస్తాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆ నియోజకవర్గంలో మూడో సంతానంగా అమ్మాయి పెట్టిందా.. అయితే రూ.50000 గిఫ్ట్‌గా(Gift) వస్తాయి. జనాభా పెరుగుదల కోసం తన నియోజకవర్గం ప్రజలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Appalanaidu) ఈ బంపర్ఆఫర్ ఇచ్చారు. ముగ్గురు పిల్లలున్న కుటుంబంలో మూడో సంతానం అమ్మాయి అయితే రూ.యాభై వేలు ఇస్తానని ఆయన ప్రకటించారు. అబ్బాయి అయిదే ఆవు, దూడ కానుక ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఈ ఆఫర్ సోషల్‌మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. ఏపీలో జనాభా పెరుగుదలపై సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. పిల్లల్ని ఎక్కువగా కనాలని ఆయన సూచిస్తున్నారు. ఉద్యోగిణులు ఎంతమంది పిల్లలను కన్నా వారికి మెటర్నిటీ సెలవు ఇస్తాయని ఆయన రెండు రోజుల కిందట ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను కూడా కూటమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తివేసింది. ఈ క్రమంలో కూటమి ఎంపీ అప్పల నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను సహచర ఎంపీలు, ఎమ్మెల్సేలు, స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.






