జనవరి నుంచి రూ.25 లక్షల వైద్య బీమా : మంత్రి అచ్చెన్న

by Muthe.Rajitha |

ఏపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.

జనవరి నుంచి రూ.25 లక్షల వైద్య బీమా : మంత్రి అచ్చెన్న
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. జనవరి 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'సంజీవని'(యూనివర్సల్ హెల్త్ పాలసీ) పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈమేరకు నేడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్న నాయుడు మీడియాకు తెలిపారు. సంజీవని హెల్త్ పాలసీ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య బీమా కవరేజీ అందించనుందని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు గ్రామంలో 100 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశామని అన్నారు. ఇక తన నియోజకవర్గంలో రూ.2.10 కోట్ల సాయాన్ని 1,200 మంది లబ్దిదారులకు అందించినట్లు తెలిపారు.

Next Story