- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TDP Mahanadu : టీడీపీకి రూ.17 కోట్ల విరాళాలు
కడప(Kadapa)లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో టీడీపీ(TDP)కి భారీ విరాళాలు(Donations) అందాయి.

దిశ, వెబ్ డెస్క్ : కడప(Kadapa)లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో టీడీపీ(TDP)కి భారీ విరాళాలు(Donations) అందాయి. టీడీపీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు కలిపి రూ.17 కోట్ల విరాళాలు అందించారు. ఈ విరాళాలను పార్టీ కార్యకర్తల సంక్షేమం, పేదల సహాయం మరియు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ప్రకటించారు. మే 27 నుంచి 29 వరకు జరిగే మహానాడు సందర్భంగా హుండీ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించడం జరిగింది.
అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా విరాళాలు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఈ మహానాడు కోసం 19 కమిటీలు ఏర్పాటు చేసి, లక్షలాది మంది కార్యకర్తలను సభకు తరలించారు. కడప నగరంలో మొదటిసారి జరిగిన ఈ కార్యక్రమం చరిత్రాత్మకంగా నిలిచేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన దాతలందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.






