Chandrababu Naidu : పహల్గం ఉగ్రదాడి మృతులకు రూ.10 లక్షల పరిహారం: చంద్రబాబు

by Muthe.Rajitha |

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgoan Terror Attack)లో మృతి చెందిన ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నష్ట పరిహారం ప్రకటించారు.

Chandrababu Naidu : పహల్గం ఉగ్రదాడి మృతులకు రూ.10 లక్షల పరిహారం: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgoan Terror Attack)లో మృతి చెందిన ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నష్ట పరిహారం ప్రకటించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి(Chandramouli)కి బుధవారం వైజాగ్ లో నివాళులు(Tributes) అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడి అనాగరిక చర్యగా పేర్కొన్నారు. కశ్మీర్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుండగా.. ఈ దాడితో అవన్నీ కుంటుపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిచాలని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు.. సరిహదుల్లో ముష్కరుల చొరబాటును అడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడిలో వైజాగ్ కు చెందిన చంద్రమౌళితోపాటు, కావలికి చెందిన మధు సూదన్ రావులు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు.

Next Story