- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడు RRR.. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్: భీమవరం డీఎస్పీకి మద్దతుగా కీలక వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
భీమవరం డీఎస్పీకి మద్దతుగా అప్పుడు RRR, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: భీమవరం డీఎస్పీ జయసూర్య(Bheemavarm Dsp Jayasurya) వ్యవహార శైలిపై ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే డీఎస్పీ జయసూర్య చాలా మంచి వ్యక్తి అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Deputy Speaker Raghu Rama Krishnam Raju) తెలిపారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా జయసూర్యకు మద్దతు పలికారు. డీఎస్పీ జయసూర్య విషయంలో పవన్ కల్యాణ్‌ను తప్పుదోవ పట్టించారని తెలిపారు. 14 నెలలు భీమవరంలో పేకాట క్లబ్‌ల నుంచి డబ్బులు వసూళ్లు చేశారని, అవి ఇప్పుడు ఆగిపోవడంతోనే డీఎస్పీపై ఫిర్యాదు చేశారని చెప్పారు. క్లబ్‌ల నుంచి వసూళ్లకు పాల్పడింది ఎవరో అందరికీ తెలుసని తెలిపారు. డీఎస్పీ విషయంలో రఘురామకృష్ణంరాజు చెప్పింది వాస్తవమని గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Next Story






