రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం.. ఎమ్మెల్యే కోటంరెడ్డి రియాక్షన్ ఇదే

by Kema Shiva Kumar |

యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్ (Srikanth) పెరోల్ వివాదం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.

రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం.. ఎమ్మెల్యే కోటంరెడ్డి రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్ (Srikanth) పెరోల్ వివాదం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అయితే, పెరోల్ విషయంలో రాష్ట్ర హోం మంత్రితో వంగలపూడి అనిత (Home Minister Anitha)తో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) సహకరించారంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తాను శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చిన మాట వాస్తవేమని అన్నారు. అతడి తండ్రి తన దగ్గరికి వచ్చి అభ్యర్థిస్తే.. తప్పక రికమెండేషన్ లెటర్ ఇచ్చానని అన్నారు. కానీ, తన లేఖను జూలై 16న పోలీసు ఉన్నతాధికారులు తరస్కరిస్తున్నట్లుగా రాతపూర్వకంగా ప్రత్యుత్తరం పంపారని వెల్లడించారు. అయితే, ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో ఉన్న తాము చాలా మందికి లేఖలు ఇస్తుంటామని, గతంలో ఇదే రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంజీవయ్య కూడా లేఖలు ఇచ్చారని ఆరోపించారు. ఇకపై భవిష్యత్తులో తాను ఎవరికీ పెరోల్ లేఖలు ఇవ్వనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు.

Next Story