Rowdy sheeter: ధర్మవరంలో నడిరోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య.. వేటకొడవళ్లతో అతి కిరాతకంగా..

by Ramesh Naini |

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దారుణ ఘటన కలకలం రేపుతోంది.

Rowdy sheeter: ధర్మవరంలో నడిరోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య.. వేటకొడవళ్లతో అతి కిరాతకంగా..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) పట్టణంలో దారుణ ఘటన కలకలం రేపుతోంది. పట్టపగలే నడిరోడ్డుపై రౌడీ షీటర్ (Rowdy sheeter) దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా పోలీసులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎర్రగుంట సర్కిల్‌కి చెందిన లోకేశ్ అనే స్థానిక రౌడీషీటర్ బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఆతన్ని బైక్‌ను కారుతో దుండగులు ఢీకొట్టారు. దీంతో ఆయన బైక్‌పై నుంచి కింద పడిన తర్వాత వేటకొడవళ్లతో (brutally murdered) దారుణంగా నరికి హత్య చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఓ మహిళ హత్య కేసులో నిందితుడిగా రౌడీషీటర్ లోకేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ హత్య కేసులో నిందితుడిగా రౌడీషీటర్ లోకేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేపట్టారు.

Next Story