‘హోంమంత్రి అహంకారానికి ఇదే నిదర్శనం’.. రోజా సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-17 14:30:53  IST  )

ఏపీలోని కుప్పం నియోజకవర్గంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

‘హోంమంత్రి అహంకారానికి ఇదే నిదర్శనం’.. రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని కుప్పం నియోజకవర్గంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో(Kuppam) ఇలాంటి ఘటన జరగడం పై వైసీపీ(YSRCP) నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) కుప్పం ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో(Andhra Pradesh) మహిళలకు రక్షణ కరువైందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని వైసీపీ నేత రోజా విమర్శించారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ముని కన్నప్ప నుంచి రూ.80 వేలు అప్పు తీసుకున్న తిమ్మరాయప్ప తిరిగి చెల్లించకపోవడంతో అతని భార్యను చెట్టుకు కట్టేసి వేధించారని మాజీ మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించాలని మహిళను అందరూ చూస్తుండగానే చెట్టుకు కట్టేసి చిత్రహింసలు గురి చేశారని తెలిపారు.

కర్రతో దాడి చేయడమే కాకుండా మొహంపై ఉమ్మేసి .. అసభ్యకరంగా ప్రవర్తించారని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఇదేనా మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? అంటూ ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రిగా మహిళ ఉండి కూడా ప్రయోజనం లేదు. కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం హోం మినిస్టర్ అనితకు లేదా? అని ప్రశ్నించారు. బాధితురాలితో వీడియో కాల్ లో మాట్లాడటం హోంమంత్రి(Home Minister) అహంకారానికి నిదర్శనం అని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

Next Story