గంజాయి దందాలో రోజా ఫ్యామిలీ : గాలి భాను ప్రకాష్

by Muthe.Rajitha |

ఏపీలోని నగరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్(Gali Bhanu Prakash) మరోసారి వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Roja)పై సంచలన ఆరోపణలు చేసారు.

గంజాయి దందాలో రోజా ఫ్యామిలీ : గాలి భాను ప్రకాష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని నగరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్(Gali Bhanu Prakash) మరోసారి వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Roja)పై సంచలన ఆరోపణలు చేసారు. రోజా, ఇంకా ఆమె కుటుంబ సభ్యులు బియ్యం, ఇసుక అక్రమ రవాణా, గంజాయి వ్యాపారంలో పాలుపంచుకున్నారని ఆరోపించారు. గంజాయి దందాలో ఆమె కుటుంబం ఇన్వాల్వ్ అయినట్లు రుజువైతే, వారిని 'మెడ పట్టుకుని లాక్కెళ్లి లోపల వేస్తామని' తీవ్రంగా హెచ్చరించారు. తాము ఎవరి బెదిరింపులకూ భయపడేవారు కాదని గాలి భాను ప్రకాష్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

అయితే గతంలో కూడా వీరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. రోజా 'రూ. 2 వేలు ఇస్తే ఏ పనైనా చేసేది' అని, 'వ్యాంప్‌గా ఎక్కువ, హీరోయిన్‌గా తక్కువ' అని అనుచిత వ్యాఖ్యలు చేసారు. భాను ప్రకాష్ తనపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లకు ఫిర్యాదు చేసింది రోజా. కాగా టీడీపీ నాయకత్వం మహిళలను అవమానించే సంస్కృతిని ప్రోత్సహిస్తోందని వైసీపీ అధినేత,మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.

Next Story