- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓడిపోతే పారిపోయే బ్లడ్ నాది కాదు - రోజా
రోజా సంచలన కామెంట్స్ చేశారు. ఓడిపోతే పారిపోవాలనే క్యారెక్టర్ నాది అయితే రెండుసార్లు ఓడిపోయి గెలిచానని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. ఓడిపోతే పారిపోవాలనే క్యారెక్టర్ నాది అయితే రెండుసార్లు ఓడిపోయి గెలిచానని వెల్లడించారు. ఓడిపోతే పారిపోయే బ్లడ్ నాది కాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు రోజా. జగనన్న లాంటి దమ్మున్న నాయకుడితో పనిచేసినందుకు నాకు గర్వంగా ఉందని తెలిపారు. జీవితాంతం నగరిలోనే ఉంటానన్నారు.
తనకు నగరిలో ఇల్లు ఉంది, కొత్తగా ఇంటిని కట్టుకున్నాను.. నేను ఎక్కడికి పారిపోలేదన్నారు. ఇకపై మరింత ఫోర్స్ గా ప్రజల్లోకి వెళతాం, పోరాటం చేస్తాం, ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామన్నారు. కానీ పారిపోనని తేల్చి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పని చేయలేకపోయాననే బాధ తనకు ఉందని ఎమోషనల్ అయ్యారు. వచ్చేది జగన్ సర్కార్ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని ఫైర్ అయ్యారు. కానీ జగన్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చినట్లు గుర్తు చేశారు.
టీడీపీ చేతిలో ఓడిన రోజా
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి రోజా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటివరకు మంత్రిగా కొనసాగిన రోజా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 45 వేల పైచిలుకు ఓట తేడాతో రోజా ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో 62,793 ఓట్లు రోజా సాధించారు.






