- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పం, పిఠాపురం, మంగళగిరి ఎక్కడైనా సరే.. చూసుకుందాం అంటూ రోజా సవాల్
ఆంధ్రప్రదేశ్ ( AP ) రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి రోజా (Roja) ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.... కూటమి

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( AP ) రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి రోజా (Roja) ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.... కూటమి ప్రభుత్వం పథకాలన్నీ ఆపేసి.. అప్పులు, అరాచకాలు, అక్రమాలు చేస్తోందని నిప్పులు చెరిగారు రోజా. ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చి... ఇప్పుడు చేతులెత్తేసిందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.
టిడిపి పార్టీ ( Tdp party) నిర్వహించబోతున్న మహానాడు పై ( Mahanadu)... ఏపీ మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని... మహానాడు లో తీర్మానం వేయగలరా అంటూ సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలను ఒక్కటైనా నెరవేర్చినట్లు ప్రజలతో చెప్పిస్తారా...? దీనికోసం ఎక్కడికైనా వస్తామంటూ చాలెంజ్ చేశారు రోజా.
మంగళగిరి, కుప్పం, పిఠాపురం అలాగే హిందూపురం ఇలా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి నిరూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా..? అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చింది చేసింది... అక్రమాలు అలాగే అప్పులు, అరాచకాలు అంటూ మాజీమంత్రి రోజా పైరయ్యారు.






