Roja: రోజా జైలుకెళ్లడం పక్కా.. రవినాయుడు సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

త్వరలోనే మాజీ మంత్రి రోజా (Roja) అరెస్ట్ అవ్వడం ఖాయమని ఏపీ షాప్ చైర్మన్ రవి కుమార్ (Ravi Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు.

Roja: రోజా జైలుకెళ్లడం పక్కా.. రవినాయుడు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలోనే మాజీ మంత్రి రోజా (Roja) అరెస్ట్ అవ్వడం ఖాయమని ఏపీ షాప్ చైర్మన్ రవి కుమార్ (Ravi Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. క్రీడా సామగ్రి కొనుగోళ్లలో రూ.119 కోట్లకుపైగా నిధులు పక్కదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. టూరిజం (Tourism) పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Temple)లో బ్లాక్ టికెట్ల (Black Tickets) దందాతో రూ.కోట్లు వెనకేసుకున్నారని కామెంట్ చేశారు. నగరి (Nagari) నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని మాజీ మంత్రి రోజా (Roja) ఆచితూచి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. విచారణతో తన అవినీతి ఎక్కడ భయటపడుతుందోనని రోజాను భయం వెంటాడుతోందని అన్నారు. ఏ క్షణమైనా మాజీ మంత్రి రోజా అరెస్ట్ పక్కా అంటూ.. రవినాయుడు (Ravi Naidu) హెచ్చరికలు జారీ చేశారు.

Next Story