మంచి మనసు చాటుకున్న మాజీ మంత్రి రోజా

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత రోజా ( Former Minister Roja) మంచి మనసు చాటుకున్నారు. ఓ విద్యార్థికి ఆర్థిక

మంచి మనసు చాటుకున్న మాజీ మంత్రి రోజా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత రోజా ( Former Minister Roja) మంచి మనసు చాటుకున్నారు. ఓ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు రోజా. విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాధ రెడ్డి కుమార్తె జయ శ్రీ నీట్ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించారు. ఈ నీట్ పరీక్షలో 95.86%తో ఏకంగా 471 మార్కులు సాధించారు జయ శ్రీ.

ఈ నేపథ్యంలోనే విద్యార్థిని జయ శ్రీని (Jaya sri) అభినందించారు మాజీ మంత్రి రోజా. అనంతరం ఆమెకు భరోసా కల్పించారు. మెడిసిన్ చదువుకు అయ్యే ఖర్చులు మొత్తం తామే చెల్లిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇక నుంచి ఎలాంటి అవసరం ఉన్న తనను... సంప్రదించాలని.. విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా స్పష్టం చేశారు. ఇక మాజీ మంత్రి రోజా ఇచ్చిన భరోసా నేపథ్యంలో.. జయశ్రీ అలాగే ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

Next Story