అలా చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా..భాను ప్రకాష్‌కు రోజా సవాల్

by Ajay Maddhiboyina |

డైవ‌ర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మాజీ మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు నుండి భాను ప్రకాష్ వరకు టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, డైవర్డ్ చేయడానికే తప్పుడు కేసులు పెట్టడం,

అలా చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా..భాను ప్రకాష్‌కు రోజా సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: డైవ‌ర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మాజీ మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు నుండి భాను ప్రకాష్ వరకు టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, డైవర్డ్ చేయడానికే తప్పుడు కేసులు పెట్టడం, లేదా క్యారెక్టర్ పై నిందనలు వేస్తున్నారని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా చీప్‌గా మాట్లాడటం బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థం అవుతుందని మండిపడ్డారు. ఒక మహిళ అని చూడకుండా, హీరోయిన్ అని చూడకుండా తన గురించి మాట్లాడటం ఆయన చీప్ క్యారెక్టర్ తెలిసేలా చేస్తున్నాయని అన్నారు.

ఒక తల్లి కడుపున పుట్టినవాడు తల్లి, చెల్లి, భార్య ఉన్నవాళ్లు వాళ్లకు ఇచ్చిన గౌరవమే అందరికీ ఇవ్వాలన్నారు. పార్టీ మీటింగ్స్ లో కూడా భాను ప్రకాష్ అలానే మాట్లాడతాడని తమకు సమాచారం ఉందని, ఆధారాల కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. నగరి నడిఒడ్డున వాళ్ల నాన్న విగ్రహాన్ని తెరిచేటప్పుడు భాను ప్రకాష్ తన గురించి మాట్లాడారని అన్నారు. వాళ్ల నాన్న విగ్రహం తెరిచేటప్పుడు ఆయన గురించి, గొప్పదనం గురించి చెప్పాలన్నారు. కానీ అవేం లేవు కాబట్టే తన గురించి మాట్లాడాడని మండిపడ్డారు. వెయ్యి కోట్లు దోచుకున్నానని ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపించాలని రోజా భాను ప్రకాష్‌కు సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని లేనిపక్షంలో భాను ప్రకాష్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

Next Story