AP News : ఏపీలో దారుణం.. అహ్మదాబాద్ వ్యాపారికి చెందిన రూ. 4.5 కోట్లు చోరీ

by Muthe.Rajitha |   (  Updated:2025-06-13 16:24:59  IST  )

ఏపీ(AP)లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

AP News : ఏపీలో దారుణం.. అహ్మదాబాద్ వ్యాపారికి చెందిన రూ. 4.5 కోట్లు చోరీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్ కు చెందిన వ్యాపారి డబ్బులు రూ.4.5 కోట్లు చోరి(Robbery)కి గురయ్యాయి. నెల్లూరు సరిహద్దులో విజయవాడ హైవే(Vijayawada Highway) మీద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వ్యాపార పనుల్లో భాగంగా అహ్మదాబాద్ వ్యాపారి రూ.4.5 కోట్లను ఢిల్లీ నుంచి చెన్నైకి కారులో డ్రైవర్, గుమాస్తాకు ఇచ్చి పంపించారు. కాగా కారు నెల్లూరు సరిహద్దులోకి రాగానే GPRS సిగ్నల్ కట్ అవగా.. అనుమానం వచ్చిన వ్యాపారి గుమాస్తాకు, డ్రైవర్ కు ఫోన్ చేశాడు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉండటంతో, డబ్బు చోరీ అయినట్టు గుర్తించాడు.

నెల్లూరు పోలీసులకు ఫోన్లో సమాచారం అందించగా.. అప్రమత్తం అయినా మర్రిపాడు పోలీసులు హైవేపై కారును గుర్తించారు. కారులోని లాకర్లు తెరిచి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం నాలుగు బృందాలుగా వెతుకులాట ప్రారంభించారు. ఈ ఘటనలో అనుమానం ఉన్న నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story