రాజధానిలో రోడ్లకు మహర్దశ.. రూ. 682 కోట్లు విడుదల

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర రాజధానిలో రోడ్లకు మహర్దశ ప్రారంభమైంది...

రాజధానిలో రోడ్లకు మహర్దశ.. రూ. 682 కోట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజధాని(Ap Capital)లో రోడ్లకు మహర్దశ ప్రారంభమైంది. భవిష్యత్తు దృష్ట్యా అమరావతి(Amaravati)లో రోడ్లు భారీగా విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అమరావతిలో 2 ఫేజ్‌ల్లో ఈ3 రోడ్లు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే మరో ఫేజ్‌లోనూ రోడ్డును నిర్మించేందుకు అడుగులు వేసింది. ఈ మేరకు భారీగా నిధులు విడుదల చేసింది. మొత్తం రూ . 682.99 కోట్లు విడుదలకు కావాల్సిన పరిపాలన అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్రిడ్జిలు, అండర్ పాస్‌లతో పాటు 6లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ఎన్ హెచ్-16(NH-16)కి ఈ రోడ్డును కనెక్టివిటీ చేయనున్నారు. దీంతో ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అమరావతికి వచ్చేలా ఇప్పటికే రెండు ఫేజ్‌లో ఈ3 రోడ్ల నిర్మాణం జరిగింది. తాజాగా చేపట్టనున్న మూడో ఫేజ్ రోడ్డు నిర్మాణం అమరావతికి చేరుకునేందుకు మరింత సులువుగా ఉండనుంది. ఈ3 రోడ్డు నిర్మాణంతో అమరావతిలో అటు అభివృద్ధి కూడా పరుగులు తీసే అవకాశం ఉందని పలువురు అధికారులు అంటున్నారు.

Next Story