ఏపీలో రోడ్లకు మహర్దశ.. భారీగా నిధుల విడుదల

by Vemula.Srinu Prasad |

ఏపీలో రోడ్లకు మహర్దశ పట్టనుంది....

ఏపీలో రోడ్లకు మహర్దశ.. భారీగా నిధుల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో రోడ్ల(Roads)కు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పలు రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పీడబ్ల్యూడీ, బీటీ, రింగు, లింకు రోడ్లతో పాటు పాత రహదారుల మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 220 రోడ్డు నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టనుంది. ఈ మేరకు రూ.600 కోట్లు విడుదల చేసింది. జీవో సైతం జారీ చేసింది.

కాగా రాష్ట్రంలో రోడ్లు సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంది. గత ఐదేళ్లు గోతుల పడిన రోడ్డుల్లోనే వాహన రాకపోకలు సాగాయి. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగాయి. వందల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. లెక్క లేనంత మందికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో రోడ్ల నిర్మాణాలపై గతంలోనే డిమాండ్లు పెరిగాయి. అయితే అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి(Cm Jagan Mohan Reddy) అంతగా ప్రధాన్యత ఇవ్వలేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. తాము అధికారంలోకి వస్తే రోడ్ల నిర్మాణాలు చేపడతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు రహదారుల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తాజాగా నిధులు విడుదల చేశారు.

Next Story