బస్సు ప్రమాద మృతుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

by Muthe.Rajitha |

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

బస్సు ప్రమాద మృతుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. కర్నూలు బస్సు ప్రమాదంలో రమేశ్‌ కుటుంబం మరణించిన సంగతి తెలిసిందే. వీరి అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులు.. తిరిగి ఇంటికి వెళ్తున్నారు. వింజమూరు మండలం గోళ్లవారి పల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా.. జలదంకి వద్ద వీరి కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరరు స్వల్పంగా గాయపడ్డారు. కాగా స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story