- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో వరుస రోడ్డుప్రమాదాలు.. కారు బోల్తా : నలుగురు?
శుక్రవారం విశాఖలో వరుస రోడ్డుప్రమాదాలు జరిగాయి. నలుగురు మృతి చెందగా.. ఒకరు మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం వరుస ప్రమాదాలు జరిగాయి. భీమునిపట్నం జోన్లోని వలందపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. వెంటనే ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కు తరలించారు. సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా వాహనం డీటెయిల్స్ కనుక్కునే పనిలో పడ్డారు.
భీమిలి బీచ్ రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడటంతో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు అదుపుతప్పి డివైడర్ ను, టెలిఫోన్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. కాగా.. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.






