ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Thanuru Gopichand |   (  Updated:2025-12-27 04:35:16  IST  )

ఏలూరు జిల్లాలో (Eluru) మరో రోడ్డు ప్రమాద ఘటన (Road Accident) వెలుగు చూసింది.

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లాలో (Eluru) మరో రోడ్డు ప్రమాద ఘటన (Road Accident) వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలను కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబాల ఇంట విషాదం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్వారకాతిరుమలకు చెందిన రఫీ, చరణ్, బన్నీ అనే యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణను చేపట్టారు. రాంగ్ రూట్ లో యువకులు బైకుపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నానాటికి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరుగుతున్న వార్తలు వెలికి వస్తున్నాయి. ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రమాదాల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొగ మంచు, అర్థరాత్రి ప్రయాణాలు వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు కూడా అత్యవసర ప్రయాణం అయితే తప్ప రాత్రివేళ ప్రయాణం మానుకోవాలని అధికార యంత్రాంగం కోరుతోంది. వీలైనంత వరకు ప్రజా రవాణ వ్యవస్థను వినియోగించుకోవాలని, తప్పని పరిస్థితుల్లో జాగ్రత్తలను పాటిస్తూ సొంత వాహనాల్లో ప్రయాణించాలని సూచిస్తోంది.

మరో ఘటనలో..

గుంటూరులోని రెడ్డిపాలెం రైల్వే గేట్ సమీపంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొట్టింది. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ సుభాని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి జిల్లా గవర్నమెంట్ హాస్పటల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి వయసు (50) ఉంటుందని, అతని శరీరంపై బిస్కెట్ కలరు గళ్ల చొక్కా, మెరూన్ కలర్ లుంగీ ఉన్నట్లు తెలిపారు.

Next Story